ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది పాయల్ రాజ్‌పుత్. తనకు తొలి తెలుగు చిత్రమే అయినప్పటికీ తనదైన నటనతో ఇక్కడి యువత హృదయాలను దోచుకుందీ భామ. ‘వెంకీమామ’, ‘ఆర్‌డీఎక్స్ లవ్’, ‘డిస్కో రాజా’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ చిన్నది నటించిన ‘రక్షణ’ సినిమా గత జూన్‌లో విడుదల కాగా, మిశ్రమ స్పందన దక్కింది. ప్రస్తుతం ‘గోల్‌మాల్’, ‘ఏంజెల్’, ‘కిరాతక’ మూవీల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా, పాయల్ రాజ్‌పుత్ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని తనదైన ప్రదర్శనతో సందడి చేసింది.
పలు ఆసక్తికర విషయాలను సైతం ఆహూతులతో పంచుకంది. ‘ఇప్పటివరకూ నేను ఐఫా, సైమా వంటి చాలా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకల్లో పాల్గొన్నా. ఫిల్మ్‌ఫేర్ అవార్లు కార్యక్రమానికి రావటం ఇదే మొదటిసారి. సినిమాను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదొక మంచి వేదిక. వివిధ భాషలకు చెందిన నటీనటులను ఇక్కడ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని పాయల్ చెప్పింది.
ఇంకా తనపై వచ్చిన ఫన్నీ రూమర్స్ గురించి చెప్పాలని కోరితే.. ‘ప్రభాస్‌తో నా పెళ్లయిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.. వాటిని చూసి బాగా నవ్వుకున్నా.. ఇది నిజమైతే బాగుండు అనుకున్నా’ అని బదులిచ్చింది. అయితే, తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని ఇప్పటికే వివిధ సందర్భాల్లో చెప్పింది పాయల్. అవకాశం వస్తే ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపిందీ ఢిల్లీ సుందరి.