04-03-2025 08:54:10 PM
మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి...
ఎల్బీనగర్: ఎవరూ అడ్డుపడినా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి అన్నారు. మంగళవారం హయత్ నగర్ ప్రాంతంలోని వివిధ కాలనీల్లో పర్యటించి, సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివేకానంద నగర్ కాలనీ, జడ్జెస్ కాలనీ, వీరన్న గుట్ట (షిరిడి సాయి నగర్ కాలనీ), పవనగిరి కాలనీ ఫేజ్ -3 లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... వివేకానంద నగర్ కాలనీలో వారం రోజుల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా రూ, 50 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
వీరన్న గుట్టలోని షిరిడి సాయినగర్ కాలనీలో పోచమ్మ గుడి వద్ద సుమారు రూ, 10.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మిస్తామన్నారు. సహారా ఎస్టేట్స్ గేట్ -2 నుంచి పెట్రోల్ బంక్ దగ్గర వరకు సుమారు రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. పవనగిరి కాలనీ ఫేజ్-3 లో రూ.30 లక్షలతో వేసిన సీసీ రోడ్డు పనులకు కొందరు సమస్యలు సృష్టించి అడ్డుకున్నారని, త్వరలో కాలనీ వాసులతో చర్చించి పనులు పూర్తి చేయిస్తామని వివరించారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సైది రెడ్డి, పవన్, నర్సింహ యాదవ్, హరి ప్రసాద్, పుష్ప లత, సాయిలు గౌడ్, సత్యపాల్ రెడ్డి, మాధవ్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, ఆకుల సత్యం, కోటయ్య, నవీన్ రావు, వెంకటరమణ గౌడ్, నర్సింహుడు, రమేశ్ చారి, ఎల్లారెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, సాయిరామ్ గౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.