calender_icon.png 28 April, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ నమ్మకం రెట్టింపయ్యేలా పనిచేస్తా

28-04-2025 12:48:03 AM

- ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందాం 

- బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 27 (విజయ క్రాంతి) : ఏ నమ్మకంతో అయితే మీరు ఆయా పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో ఆ నమ్మకం రెట్టింపు అయ్యేలా పనిచేస్తారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి భరోసా నిచ్చారు.

ఆదివారం అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన అడ్డాకుల మండల బీజేపీ  నేతలు కావలి రాజు,  రవికుమార్, రాచాల, కనిమెట్ట గ్రామాలకు చెందిన బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు  ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ పార్టీని వీడి ఎమ్మెల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపరాలలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని తెలిపారు. ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.