calender_icon.png 10 March, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ సాంగ్స్‌కు పనిచేస్తా, కానీ..

10-03-2025 12:00:00 AM

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో తన అందచందాలతో ‘ప్రత్యేక’ గుర్తింపు తెచ్చుకుంది నోరా ఫతేహి. హిందీతోపాటు తెలుగు చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్‌లో మెరిసి ప్రేక్షకులను అలరించిందీ భామ. అయితే, ఈ ప్రత్యేక గీతాలతో తనకు ఆర్థికంగా ఒరిగిందేమీ లేదంటూ వాపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నోరా కెరీర్‌లో ముందుకు సాగే క్రమంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించింది.

‘చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు నేను డ్యాన్స్ చేశాను. సినిమా విజయం, బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలోనూ ఆ సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. అయితే,  నేను తప్ప అందరూ లాభపడుతున్నారని నాకు అర్థమైంది. ఆయా చిత్రబృందాలకు యూట్యూబ్‌తోపాటు వివిధ మార్గా ల్లో రెవెన్యూ వస్తోంది. కానీ, నాకు మాత్రం నిర్మాతలు పారితోషికంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

నేను ఉచితంగానే వాళ్లకు పనిచేశా. బయట ఎక్కడైనా ప్రదర్శనలు ఇచ్చిన సందర్భంలోనే నాకు పేమెంట్ ఇచ్చేవాళ్లు. అయితే, వ్యవస్థపై పోరాటం చేయాలన్న ఆలోచనలేదు. అలాగని డబ్బు లేకుండా కేవలం పేరు కోసమే పనిచేస్తే ఏం లాభం? భవిష్యత్తులో నా కుటుంబానికి ఏం ఇవ్వగలను?! అందుకే ఇప్పుడు దానికి అనుగుణంగా పనిచేస్తున్నా. స్పెషల్ సాంగ్స్‌లో పనిచేయడానికి ఇప్పటికీ నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఇప్పుడు నాకు గుర్తింపు, రెవెన్యూ.. రెండూ ముఖ్యమే’ అని తెలిపింది నోరా ఫతేహి.