జగిత్యాల అర్బన్, జనవరి 5: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 74వ జన్మదిన వేడుకలను ఆదివారం కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయమే జీవన్’రెడ్డి పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందుకున్నారు.
ప్రభుత్వ విప్, డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జీవన్’రెడ్డి నివాసానికి చేరుకొని జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. అభిమా నులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జీవన్’రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లాలోని నాయ కులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
అనంతరం వాల్మీకి ఆవాసంలో జీవన్ రెడ్డి ఆవాస విద్యార్థుల మధ్య తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆవాస పిల్లల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషకరమ న్నారు. తాను ఏ హోదాలో ఉన్నప్పటికీ ప్రజా సేవ కోసమే పని చేస్తానన్నారు.
రాష్ర్టంలో అధికా రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే అదనంగామరిన్ని సంక్షేమాలను అమలు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.