calender_icon.png 2 April, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు సినిమాభివృద్ధికి కృషిచేస్తా

30-03-2025 12:04:17 AM

‘కథా బలమున్న చిత్రా ల్లో నటిస్తూ తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక స్టార్ హీరోగా తన వంతు కృషి చేస్తా ను’ అని చెప్పారు హీరో విజయ్ దేవరకొండ. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో విజయ్ మాట్లాడారు. ‘ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రపంచం చాలా చిన్నదైంది. మనం కే డ్రామాస్ చూస్తున్నాం, కొరియన్ బీటీఎస్‌ను ఇష్టపడుతున్నాం. అలాంటప్పుడు సౌత్ సినిమాను నార్త్ ప్రేక్షకులు అభిమానించడంలో ఆశ్చర్యంలేదు.

సక్సెస్, ట్రెండ్ అనేది ఒక సర్కిల్ అయితే.. అందులో ఇప్పుడు టాలీవుడ్ వంతు వచ్చింది. రేపు మరో ఇండస్ట్రీ లీడ్ తీసుకోవచ్చు. మన దగ్గర ప్రతిభావం తులైన దర్శకులున్నారు. నేను ప్రతి ఒక్కరితో పనిచేయాలని అనుకుంటున్నా.  రాజమౌళి ‘బాహు బలి’ తీసినప్పుడు అదొక పెద్ద రిస్క్. అలా ప్రతి ఇండస్ట్రీ ఇలాంటి స్ట్రగుల్ పడాలి. అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు. ప్రేక్షకులకు సరికొత్త కథలు చెప్పాలి. టాలీవుడ్ సక్సెస్‌లో నా వంతు కృషి చేయా లని ప్రయత్నిస్తున్నా” అన్నారు.