calender_icon.png 10 March, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటిలో రుగ్మతలు లేకుండా వైద్య పరీక్షలు చేయిస్తాను...

09-03-2025 06:02:20 PM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...

మునుగోడు/నాంపల్లి (విజయక్రాంతి): నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కంటి రుగ్మతలు లేకుండా వైద్య పరీక్షలు చేయిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) తెలిపారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి, ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరం ఉన్న వారిని గుర్తించి ఉచితంగా ఆపరేషన్లు చేయించి అద్దాలు అందజేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కుంభం కృష్ణారెడ్డి, మాజీ జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్రావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి, గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, గపార్, మేకల రమేష్ ముదిరాజ్, ఎస్.కె చాంద్ పాషా, చలిదోన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం చైర్మన్ రవి, సుధనబోయిన శ్రీను, టీపి గౌరారం మాజీ ఉప సర్పంచి కృష్ణారెడ్డి మెగావత్ దీప్లా నాయక్, జాను నాయక్, దూదిమెట్ల యాదగిరి, మల్లెపల్లి రజిత, తదితరులు పాల్గొన్నారు.