ఎదుటి వారిపై మాటల దాడి చేయడంలో మాజీ సీఎం కేసీఆర్‌కు తాను తక్కువేమీ కాదని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ‘మాటలు మాకూ వచ్చు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు.. నేను ఇయ్యాల మొదలుపెడితే రేపటిదాకా మాట్లాడుతా’ అని జలక్ ఇచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో తిట్ల పురాణం కొత్తది కాదు. ఆ సంప్రదాయానికి నాంది పలిన మాజీ సీఎం కేసీఆరే..
ఇప్పుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని రేవంత్‌రెడ్డిని వారించడం రాష్ట్ర ప్రజలకు కొంత వింతగానే అనిస్తోంది. తన వాక్ఛాతుర్యం, తిట్ల దండకంతో ఒకప్పుడు ప్రత్యర్థులను హడలెత్తించిన కేసీఆర్ బాటలోనే ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చిన నడుస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ అయననే అనుసరిస్తున్నారు.