09-04-2025 12:00:00 AM
ఏపీ పోలీసులపై వైసీపీ అధినేత జగన్ ఫైర్
అమరావతి, ఏప్రిల్ 8: “మీ యూనిఫాంలు ఊడదీస్తా..బట్టలూడదీసి కొడుతా..”అంటూ ఏపీ పోలీసు లపై వైసీపీ అధినేత జగన్ వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. మంగళవా రం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో జగన్ పర్యటించారు. ఇటీవల హత ్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమ య్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం జగన్ మాట్లా డుతూ..
రాష్ట్రంలో ఎల్లకాలం టీడీపీ పాలన కొనసాగదని.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊడిగం చేసేవారికి శిక్షతప్పదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పోలీసు అధి కారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడుతామన్నారు.