calender_icon.png 24 February, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను నమ్ముకున్న వాళ్లను ఆదరిస్తా

18-02-2025 01:22:13 AM

 నాతో అవసరం లేని వారు నాకు దూరంగా ఉండండి 

నన్ను నమ్ముకున్న వాళ్లను ఇబ్బంది పెట్టవద్దు

పేదవారి అభివృద్ధి, సంక్షేమమే నాకు ముఖ్యం

పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనలో మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, ఫిబ్రవరి 1౭ (విజయక్రాంతి): నన్ను నమ్ముకున్న వాళ్ళను ఆదరిస్తాని, నాతో అవసరం లేని వారు నాకు దూరంగా ఉండండని, తనను నమ్ముకున్న వాళ్ళను ఇబ్బంది పెట్టవద్దని, పేదవారి అభివృద్ధి సంక్షేమమే నాకు ముఖ్యమని, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంథని పట్టణంలో నిర్వహించిన  ఆత్మీయ సమ్మేళనంలో  పాల్గొన్న మంత్రి  శ్రీధర్ బాబు మాట్లాడుతూ  విద్యా వ్యవస్థ మెరుగుపరచాలంటే ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అవసరమని, వందలాదిమంది విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇచ్చిన వ్యక్తి నరేందర్ రెడ్డీ అని, విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టే పేదవాడి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నడని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం  విద్యావస్థలో  సమూల మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని,  నన్ను నమ్ముకున్నవాళ్ళను  ఆదరిస్తా, నాతో అవసరం లేని వారు నాకు దూరంగా ఉండండి. పేదవారి అభివృద్ధి నాకు ముఖ్యమని ఘాటుగా తెలిపారు.

జీవో నెంబర్ 317 ను సవరణలు చేశామని,  యంగ్ ఇండియా స్కీల్ యూనివర్శిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నాకు మొదటి నుండి మద్దతు పలికిన వ్యక్తి మంత్రి శ్రీధర్ బాబు అని, నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని,  ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు ఫీజులో  5% రాయితీ ఇస్తానని ప్రమాణం చేస్తున్నానని, ప్రైవేట్ టీచర్స్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని మంత్రి సహకారంతో చదువుకున్న మేధావులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం మంథని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమంలో రాష్ర్ట ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్,  మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, మంథని తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రూ రమాదేవి, సింగల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కొండ శంకర్, ఆకుల కిరణ్,  చొప్పరి సదానందం, వైరాల రాజు, దొడ్డ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.