* పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పీ ప్రసన్న హరికృష్ణ
గజ్వేల్, డిసెంబర్ 30: విద్యార్థి స్థాయి నుంచి నిరుద్యోగ, ఉద్యోగుల స్థాయి వరకు ఎదుర్కొటున్న సమస్యలను పరిష్కరించి ఎల్లవేళలా పట్టభ అండగా ఉంటానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు.
సోమవారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రచారం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయ, ఉద్యోగులు, లెక్చరర్లతో పాటు పట్టభద్రులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలోని ప్రాంతాల్లో విద్యార్థులు, పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఎదుర్కుంటున్న సమస్యలు తనకు తెలుసన్నారు. గజ్వేల్ ప్రాం ప్రైవేట్ లెక్చరర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ప్రభుత్వ ఉద్యోగిగా ఇక్కడే రాజీనామా చేశానన్నారు.
తన విద్యార్థి, ఉద్యోగ జీవితంలో తోటి విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలు తనను కలచివేశా యని, వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు.