26-02-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
అమనగల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి ): ఆమనగల్ మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయే బాధితులకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం ఆమనగల్లు మున్సిపాలిటీ కార్యాలయావరణలో ఇల్లు కోల్పోయే బాధితులతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులను ఇబ్బంది పెట్టాలని లేదని అమన గల్ పట్టణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డు విస్తరణలో వెడల్పు తగ్గిస్తే పెరుగుతున్న రవాణా తో భవిష్యత్తులో ఇబ్బందులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. బాధితుల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.... అందరికీ తగు న్యాయం చేస్తానని ఆయన హామీ నిచ్చారు. సమావేశంలో తహసిల్దార్ లలిత, మున్సిపల్ కమిషనర్ శంకర్, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.