calender_icon.png 3 April, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా

02-04-2025 12:00:40 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ 

సిద్దిపేట, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టసుఖాలలో ఉండగా ఉంటానని పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాల మేరకు పని చేయాలని, కష్టమొచ్చినా కార్యకర్తలకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

సిద్దిపేట రూరల్ మండలంలోని పెద్ద లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త మోకిలా రజినీకర్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాగా మంగళవారం పార్టీ కార్యకర్తలతో కలిసి బాదిత కుటుంబాన్ని పరామ ర్శించి ఓదార్చారు.

యువకులు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని రజనీకర్ మరణం తనను కలిసివేసిందన్నారు. కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షులు అన్నసారం సురేష్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, నాయకులు కిషోర్, సురేష్, త్రిలోచన్ రెడ్డి, తాడేపల్లి శ్రీనివాస్, రాజిరెడ్డి, జనార్దన్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, ఎల్లం పాల్గొన్నారు.