31-03-2025 01:46:24 AM
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి
నాగార్జునసాగర్, మార్చి 30: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటానని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న నందికొండ మున్సిపా లిటీ పరిధిలోని పైలాన్ కాలనీకి చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్త రోషన్ను ఆదివారం ఆయన పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి ఓ కష్టం వచ్చినా జానారెడ్డి కుటుంబం అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు పగడాల నాగరాజు, ఉపేందర్ రెడ్డి, షేక్ ఖాసిం, శివ తదితరులున్నారు.