15-03-2025 06:43:58 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్నాల సత్యనారాయణ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శనివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్యకర్తల కష్టసుఖాలను పాలుపంచుకొని వారి సమస్యలను తీర్చే విధంగా కృషి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా కార్యకర్త ఆపదలో ఉంటే ఆదుకుంటామని పేర్కొన్నారు. ఏ పార్టీలో లేని విధంగా బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కార్యకర్తలకు భీమా వసతి కల్పించారని అన్నారు. ఆసుపత్రులలో చికిత్సలు చేసుకున్న తర్వాత వెంటనే బిల్లులు ఇప్పించే విధంగా సీఎంఆర్ ఏఫ్ పథకం ఎంతో మేలు చేస్తుందని ఈ అవకాశాన్ని కార్యకర్తలు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.