05-03-2025 01:09:21 AM
ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): చట్టసభల్లో ఉపాధ్యాయుల సమస్యలను లేవనెత్తి, పరిష్కారం కో సం తన గొంతుకను వినిపిస్తానని నూతనంగా ఎన్నికైన పీఆర్టీయూ టీఎ స్ టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులకు కృషి చేస్తానని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.