calender_icon.png 4 May, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ నమ్మకం రెట్టింపు అయ్యేలా సేవ చేస్తా

10-04-2025 04:35:25 PM

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు..

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి..

మూసాపేట: ఏ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుందో ఆ నమ్మకాన్ని రెట్టింపు చేసేలా సేవ చేస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి అన్నారు. మూసాపేట మండలం పోల్కంపల్లి, తిమ్మాపూర్ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు దేవరకద్ర ఎమ్మెల్యే సమక్షంలో ఎమ్మెల్యే స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు.

గత ప్రభుత్వం చేయలేని పనులు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందున బిఆర్ఎస్ పార్టీ వీడి పోల్కంపల్లి మాజీ సర్పంచ్ నస్కల యాదయ్య ఆధ్వర్యంలో సుంకర తిరుపతయ్య, రామచంద్ర గౌడ్, బయ్యా ఆంజనేయులు, బోలా వెంకటరమణ, భయ్యా లింగం, బయ్య శ్రీకాంత్, సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కలిసికట్టుగా ఉండి ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు. అభివృద్ధి చేయాలని సంకల్పంతోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టానని, నిరుపేదలను ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు సహాయ శక్తులుగా కృషి చేద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.