చెన్నై, జనవరి 24: తిరుపరంకుండ్రం మురుగన్ దేవాలయం కొండపై తాను మాం సాహారం తిన్నట్టు అన్నామలై చేసిన ఆరోపణలను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ నవాస్ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనా మా చేస్తానన్నారు. అభియోగాలను నిరూపించకపోతే అన్నామలై తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
కావాలనే తనపై బీజేపీ నేతలు త ప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డా రు. ఆలయ కొండపై ఎంపీ నవాస్ మాంసాహారం తిన్నారని అన్నామలై ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో వివాదం మొదలైంది. అన్నామలై ఆరోపణలు ఖండించడం తోపాటు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనా మా చేస్తానంటూ ఎంపీ నవాస్ సవాల్ విసర గా.. సవాల్‌ను అన్నామలై స్వీకరించారు.