calender_icon.png 15 March, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క ఎకరాకు నీళ్లిచ్చినా రాజీనామా చేస్తా

22-12-2024 01:11:04 AM

కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ 

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): గత పదేళ్లలో నల్లగొండ జిల్లాలో కొత్తగా ఒక్క ఎకరాకు సాగునీరిచ్చినట్టు రుజువు చేస్తే తాను రాజీనామా చేసి రాజకీయాలను వదిలేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ చేశారు. శనివారం రైతు భరోసాపై చర్చ సందర్భంగా కేటీఆర్ ఉచిత విద్యుత్ అంశాన్ని ప్రస్తావించగా మంత్రి కోమటిరెడ్డి స్పందించారు.

గత ఎన్నికలకు ముందు నల్లగొండ జిల్లా సబ్ స్టేషన్లల్లోని లాగ్‌బుక్‌ను పరిశీలించామని.. ఎక్కడా 14 గంటలకు మించి విద్యుత్ సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయం చెబితే ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు అన్ని జి ల్లాల్లోని సబ్‌స్టేషన్ల లాగ్ బుక్కులను తీసుకొ చ్చి లాకర్లలో పెట్టారని మండిపడ్డారు.

స్వరాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ఎక్కువగా నష్ట పోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా తెలంగాణలో లేదా? ఎందు కు నిర్లక్ష్యం చూపారని ప్రశ్నించారు. ఉ చిత విద్యుత్ ఇచ్చిం దే కాంగ్రెస్ ప్రభుత్వమని, అది తమ పార్టీ పేటెంట్ అని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు విధ్వంస పాలన కొనసాగించారని మండిపడ్డారు.

లక్ష కోట్లు వెచ్చించి కూ లిపోయే ప్రాజెక్టులు కట్టారని ఎద్దేవా చేశా రు. రూ.50వేల కోట్లతో మిషన్ భగీరథ చేప ట్టి  ఒక్క గ్రామానికి కూడా తాగునీరు ఇవ్వలేదన్నారు. ఎక్కడైనా మిషన్ భగీర థ నీరు వస్తున్నట్టు నిరూపిస్తే మళ్లీ ఓట్లు కూడా అడగబోమని సవాల్ చేశారు.

నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టిండా? వాళ్ల నాయన కట్టిండా అని ప్రశ్నించారు. నల్లగొండకు ప్రాజెక్టులకు రూ.100 కోట్లు కూడా ఇవ్వని ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. ప్రస్తు తం రేవంత్‌రెడ్డి పుణ్యమా అని నల్లగొండను సస్యశ్యామలం చేసుకుంటున్నామన్నారు.