- రూ.50 వేలతో పరార్
- చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు
మంచిర్యాల, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): క్యాష్ రిపేర్ మెషీన్ రిపేరు చేస్తానని వచ్చి ఓ వ్యక్తి బ్యాంక్‌కు వచ్చాడు. మరమ్మతుల అనంతరం మెషిన్‌ను చెక్ చేయాలని చెప్పి, బ్యాంకర్ల దృష్టి మరల్చి రూ.50 వేలతో ఉడాయించాడు. చివరకు కటాకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల పట్టణంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఆదివారం సికింద్రాబాద్‌కు చెందిన రోహిత్ బాబూలాల్ ప్రకాష్ కాలే అనే వ్యక్తి వచ్చాడు. క్యాష్ కౌంటింగ్ మెషిన్ రిపేర్ చేస్తానని చెప్పి, రిపేర్ చేశాడు.
అనంతరం చెకింగ్ పేరుతో బ్యాంకర్ల నుంచి రూ.50 వేల నగదు తీసుకుని అక్కడ నుంచి ఉడాయించాడు. ఫిర్యాదు అందుకున్న మంచిర్యాల సీఐ బన్సీలాల్, సెక్టార్ ఎస్సై వనీత సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. నిందితుడిని ఎట్టకేలకు పట్టుకుని వివరాలు వెల్లడించారు. నిందితుడు డిగ్రీ పూర్తి చేశాడు. నిజామాబా ద్‌లోని పోలీస్ స్టేషన్లలో జిరాక్స్ మెషిన్లు, ప్రింటర్లను బాగుచేసేవాడు. కొంతకాలం క్రితం అన్న, తండ్రి అనారోగ్యంతో మరణించిన తర్వాత నిందితుడు మోసాలకు పాల్పడ డం ప్రారంభించాడు. పక్కా ప్లాన్‌తో ఇటీవల మెదక్, మంచిర్యాల జిల్లాల్లోని పలు బ్యాం కుల్లో మోసాలకు పాల్పడ్డాడు.
అలా దోచిన డబ్బును జల్సాల కోసం ఖర్చు చేస్తాడు. ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ.. ఫైనాన్స్ సంస్థలు గుర్తుతెలియని వ్యక్తుల ఐడెంటిటీని చెక్ చేయకుండా లోపలికి అనుమతించవద్దని సూచించారు. సంస్థల్లో తగిన ంత సెక్యూరిటీని నియమించుకోవాలని, తప్పనిసరిగా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తు లు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.