16-04-2025 12:25:02 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 15 : తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావి స్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఉద్యమకా రుల ఫోరం ఆధ్వర్యంలో ఏప్రిల్ 21వ తేదీ సికింద్రాబాద్ సీతాఫల్ మండి జీహెచ్‌ఎంసీ ఫంక్షన్ హాల్ లో ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నారు.
ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఉద్యమకారుల పోరాటపటిమను న్యాయమైన అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి చర్చిస్తానని సానుకూలంగా స్పందించారు.
కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రంగారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కారింగుల నరేందర్ గౌడ్, దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ దుగ్గాణి శ్యామల, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు అందేకార్ బాబూలాల్ తదితర పాల్గొన్నారు.