calender_icon.png 31 January, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను భర్తకు సేవలు చెయ్యను

28-01-2025 12:00:00 AM

బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన పెళ్లి ముచ్చట్లు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకుని తన భర్త, ముగ్గురు పిల్లలతో తిరుపతిలో సెటిల్ అయిపోవాలని ఉందంటూ జాన్వీ కామెంట్స్ చేసింది. తాజాగా జాన్వీ కామెంట్స్‌పై ఆమె చెల్లి ఖుషీ కపూర్ స్పందించింది.

ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం ‘లవ్ యాపా’ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఖుషీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు కూడా గ్రాండ్‌గా తన సోదరి మాదిరిగానే తిరుపతిలో వివాహం చేసుకోవాలని ఉందని తెలిపింది. “గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచి నా కల.

అది కూడా మా అక్క చెప్పినట్టుగానే నేను కూడా తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నా పెళ్లి అయిన తర్వాత కూడా మా నాన్న బోనీ కపూర్ మాతోనే లేదంటే మేముండే బిల్డింగ్‌లోనే ఉండాలని కోరుకుంటున్నా. నేను, నా భర్త, ఇద్దరు పిల్లలు, చాలా పెంపుడు కుక్కలు.. ఇలా జీవితాన్ని ఎప్పుడూ ఊహించుకుంటూ ఉంటాను.

అయితే మా అక్కలా మాత్రం నేను నా భర్తకు ఎలాంటి సేవలూ చేయను” అని సరదాగా చెప్పుకొచ్చింది ఖుషి. ప్రస్తుతం ఖుషి నటించిన ‘లవ్ యాపా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఫిబ్రవరి 7న విడుదల కానుంది.