calender_icon.png 18 January, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కడికీ పారిపోను

12-07-2024 01:44:58 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ లేఖ

దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు.. విచారణకు సహకరిస్తానని పోలీసులకు లేఖ రాసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న జూబ్లీహిల్స్ పోలీసులకు ఆయన లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. జూన్ 26న తాను ఇండియాకి రావాల్సి ఉందని, ఆరోగ్యం బాగోలేకపోవటంతో అమెరికాలోనే ఉండిపోతున్నానని వివ రించారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు, అమెరికా డాక్టర్ల సూచనల మేరకు అక్కడే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. తనకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్‌తోపాటు ప్రస్తుతం బీపీ కూడా పెరిగిందని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు కావాలనే లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటి వల్ల తాను మానసికంగా కుంగిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.