calender_icon.png 21 November, 2024 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితంలో పెళ్లి చేసుకోను

21-11-2024 12:00:00 AM

సినీ పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్ల జోలికి వెళ్లని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు చాలా ఎక్కువ. అయితే ప్రేమ, పెళ్లి వంటి వ్యవహారాల జోలికి వెళ్లని వారిలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఒకరు. తాను జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోబోనని ఆమె తెగేసి చెబుతున్నారు. మారుతున్న పరిస్థితులో మరో కారణమో కానీ యూత్ మాత్రం పెళ్లి ఆలోచన చేయడం లేదు.

ఐశ్వర్య లక్ష్మి కూడా ఇదే చేస్తున్నారు. తెలుగులో ‘గాడ్సే, అమ్ము’ వంటి చిత్రాల్లో ఐశ్వర్య నటించారు. ‘జీవితంలో తాను పెళ్లి చేసుకోను. చాలా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు తెలిసిన జంటల్లో ఒక్క జంట తప్ప మిగిలిన వాళ్లంతా రాజీపడి బతుకుతున్నారు. పెళ్లి వల్ల వ్యక్తిగత ఎదుగుదల లేదు. అందుకే పెళ్లి వద్దని ఫిక్సయ్యా.

నాకు 25 ఏళ్ల వయసున్నప్పుడు గురువాయూర్ గుడిలో నిత్యం ఏదో ఒక పెళ్లి జరుగుతుండటాన్ని చూశా. అవి చూస్తున్నప్పుడు నాకు కూడా అలా పెళ్లిచేసు కోవాలనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లిపై పూర్తి అవగాహన వచ్చింది. కొన్నేళ్ల ముందు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నా ప్రొఫైల్ మ్యాట్రిమోనీలో పెట్టా. కానీ కొన్నాళ్లకు పెళ్లిపై నా అభిప్రాయం మారిపోయింది“ అని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు.