calender_icon.png 16 January, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను తప్పు చేయను.. తప్పు చేస్తే వదలను

10-09-2024 04:20:21 AM

  1. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అసమర్థుడు 
  2. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్

జడ్చర్ల, సెప్టెంబర్ 9: తాను తప్పు చేయకుండా సమర్థవంతగా ముందుకు సాగుతానని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో నూ వదిలిపెట్టబోనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడారు. మాజీ మంత్రి ఓ అసమర్థుడని విమర్శించారు. తన బంధువుల భూమి కోసం లక్ష్మారెడ్డి దళితులకు అన్యా యం చేశారని ఆరోపించారు. జడ్చర్లలో ని ర్మించిన వంద పడకల ఆసుపత్రి పేరిట దళితుల భూమిని లాక్కున్నారని తెలిపారు. ఆ సుపత్రి చుట్టూ లక్ష్మారెడ్డి బంధువుల భూ ములు ఉన్నాయన్నారు.

భూమి కోల్పోయిన బాధితులకు నేటికీ పరిహారం అందిం చలేదన్నారు. ప్రభుత్వ భూములపై అధికారులు సైతం తప్పుడు రికార్డులను తయారు చేసినట్లు తన విచారణలో తేలిందన్నారు. త ప్పు చేసిన వారెవరైనా జైలుకు వెళ్లాల్సి ఉం టుందని తెలిపారు. త్వరలోనే గాంధీ ట్రస్ట్, వెంకటేశ్వర స్వామి భూముల కబ్జాలను బయట పెడతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాలనగర్, గంగాపూర్ రహదారి పనుల అడ్డంకులతో ప్రజలకు ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయకుండా నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని తెలిపారు.