అంతకు ముందు బాలీవుడ్లో పలు చిత్రాలు చేసినా కూడా టాలీవుడ్ ద్వారానే బాగా ఫేమస్ అయిన ముద్దుగుమ్మల్లో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ‘సీతారామం’ సినిమాతో ఈ భామ బాగా ఫేమస్ అయిపోయారు. అమ్మడి కెరీర్ని మలుపు తిప్పిన సినిమా ఇది. తన కెరీర్ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలకు మాత్రమే పరిమితం కాదని.. అంతకు మించి ఉంటుందని ఆశిస్తున్నట్టు మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
వరుస చిత్రాలతో జోరు ప్రదర్శిస్తున్న ఈ ముద్దుగ మ్మ ప్రస్తుతం తన కోసమే కొందరు చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా కథలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. “ఈ మధ్య కాలంలో నేను చాలా స్క్రిప్టులు వింటున్నా. నన్ను నిలబెట్టినవి మాత్రం సీతారామం, హాయ్ నాన్నా చిత్రాలే. ఈ సినిమాలు నా బాధ్యతను మరింత పెంచా యి. నన్ను తమ ఇంటి బిడ్డగా ఓన్ చేసుకున్న తెలుగు ప్రేక్షకులను నిరాశ పరచను. ప్రస్తుతం నా కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నా.
ఎంతో మంది చిత్ర నిర్మాతలు నా దగ్గరకు వచ్చి నాతో సినిమా చేయాలని ఉందని చెబుతున్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. నేను ‘సీతా రామం’ లాంటి చిత్రాలతో ఓ బెంచ్ మార్క్ సిద్ధం చేశానని కాబట్టి అందుకు తగ్గట్టే ఆలస్యమైనా నా కోసం ప్రత్యేకంగా మంచి పాత్రను రాసి నా ముందుకు వస్తామని పలువురు నిర్మాతలు తెలిపారు. ఆ మాటలు నాకు చాలా సంతో షాన్నిచ్చాయి” అని మృణాల్ తెలిపారు.