- బీజేపీ నేత రమేశ్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు
- వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు
- క్షమాపణలు చెప్పిన రమేశ్
న్యూఢిల్లీ, జనవరి 5: ‘ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఏఐసీసీ అగ్ర నాయకురాలు, ఎంపీ కాం గ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంకగాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తాను’ అని బీజేపీ నేత రమేశ్ బిధూ రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెం బ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆయన్ను కల్కాజీ నియోజకవర్గం నుంచి సీఎం అతిశీపై పోటీ చేయిస్తోం ది. తాజాగా రమేశ్ మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు దుమా రం రేపింది. ‘ప్రియాంకా గాంధీపై బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఈ వ్యాఖ్యలను బట్టి రమేశ్‌కు మహిళలపై ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలోనూ రమేశ్ మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి శిక్ష అనుభవించారు. రమేశ్ అసలు స్వరూపం అందరికీ తెలిసిందే. అలాంటి ప్రవృత్తి ఉన్న వారి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు తప్పితే.. ఇంకేం ఆశించగలం’ అని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
‘రమేశ్ వ్యాఖ్యలను బట్టి ఆయన మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చు. బీజేపీకి మహిళలపై ఎంత గౌరవం ఉందో ఆయన వ్యాఖ్యలను బట్టి బేరీజు వేయవచ్చు’ అని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై రమేశ్ స్పందిస్తూ.. ‘నేను యథాలాపంగా వ్యాఖ్యలు చేశానే తప్ప, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను.
నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా’నని ‘ఎక్స్’లో ప్రకటించారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలా ప్రసాద్ యాదవ్ సైతం గతంలో నటి హేమమాలినిపై ఇవే తరహా వ్యాఖ్యలు చేయగా అప్పట్లో పెద్ద దుమారం రేగింది.
లాలూ వ్యాఖ్యలనూ బీజేపీ నేత రమేశ్ బిధూరి గుర్తుచేశారు. ‘యూపీఏ ప్రభుత్వంలో ఒకప్పుడు ఆర్జేడీ భాగస్వామి. ఆ పార్టీ అధినేత లాలా ప్రసాద్ యాదవ్ సైతం నటి హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను ప్రియాంకా గాంధీపై చేసిన వ్యాఖ్యలు తప్పయితే.. మరి లాలు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎలా చూసింది. లాలుపై నాడు కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకున్నది’ అని రమేశ్ ప్రశ్నలు సంధించారు.
అతిశీపైనా అనుచిత వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన రమేశ్ బిధూరి అనంతరం ప్రియాంకు క్షమాపణలు చెప్పారు. తర్వాత కొన్ని గంటల్లోనే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని ఓ పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగించిన ఆయన ఢిల్లీ సీఎం అతిశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అతిశీ తన ఇంటిపేరును మార్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె తన తండ్రిని కూడా మార్చేశా రని విమర్శించారు. ‘మర్లెనాగా ఉన్న అతి శీ ఇప్పుడు సింగ్. ఆమె తన తండ్రిని కూ డా మార్చింది’ అని అన్నారు. దీనిపై కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ బీజేపీ నేత లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.