విక్రమ్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్, సృజన్‌కుమార్ బొజ్జం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్‌రెడ్డి చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. “నలుగురు అబ్బాయిల లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? లవ్ బ్రేకప్ తర్వాత వాళ్ల రియలైజేషన్ ఏమిటి అనేది ఈ సినిమా.
ఫస్ట్ ఈ సినిమా దిల్ రాజు చేద్దామనుకున్నారు. కథలో మార్పులు చేయమంటే నేను ఒప్పుకో లేదు. దీనికి టైటిల్ కూడా ఆయనే ఇచ్చారు. సినీ పరిశ్రమకు నా విన్నపం ఒక్కటే ఇక్కడ చిన్న సినిమాలకు స్పేస్ ఇవ్వండి.. ప్రతి దర్శకుడూ మొదటి సినిమానే ‘ఆర్ఆర్ఆర్’లా చేయడు. రాజమౌళికి తొలి సినిమా కూడా ‘స్టూడెంట్ నెం.1’. లాంటి చిన్న సినిమానే. ఆ తర్వాత ఆయన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లాంటి గొప్ప సినిమా లు తీశాడు. ‘ఆర్ఆర్ఆర్’లాంటి సినిమా నేనూ తీస్తాను.
నా దగ్గర అలాంటి కథలు ఉన్నాయి. ఇక్కడ కావాల్సింది. స్పేస్ ఇచ్చి నిలబెట్టడం. ఇప్పుడు ఏ సినిమాలూ లేక ‘అమరన్’ ఆడుతోంది. అసలు మన సినిమాలకు అక్కడ స్పేస్ కూడా ఇవ్వరు. ఇక్కడ మన సినిమాను కాపాడుకోవాలని అందరినీ విన్నవించుకుంటున్నాను” అన్నారు.