01-03-2025 12:00:00 AM
జీవా, అర్జున్ సర్జా లీడ్ రోల్స్‌లో నటించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్లపై ఇషారి కే గణేశ్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా విజయ్ దర్శకత్వం వహించారు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిచింది. ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో హీరో జీవా విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జీవా చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే.. “అగత్యా’ కోసం మూడేళ్లు గా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇంటర్నేషన్ టె క్నికల్ టీమ్‌తో ఈ సిని మా చేశాం. అవతార్ స్థాయిలో షూట్ చేశాం. చాలా కొత్త టెక్నాలజీని వాడాం. ఇలాంటి సిని మా చేయాలని ఎప్పటినుంచో ఉండే ది. ఇప్పుడు ఆ కోరిక తీరింది. -ఈ సినిమా కోసం డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశారు. భారతీయ ఔషధాలు, వైద్యానికి సంధించిన చాలా విలువైన అంశాలు ఇందులో ఉన్నాయి.
-అర్జున్‌కి నేను బిగ్ ఫ్యాన్. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. -రాశితో పనిచేయడం కూడా మంచి ఎక్స్‌పీరియన్స్. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడానికి ఇష్టపడతా. ఇలాంటి మల్టీ స్టారర్స్ చేయడం చాలా ఇష్టం. -మంచి కథల కోసం చూస్తున్నా. మంచి స్క్రిప్ట్ కుదిరితే తెలుగులో సినిమా చేయాలనుంది” అన్నారు.