ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు డ్యూటెర్టో
న్యూఢిల్లీ, నవంబర్ 24: తన ప్రాణానికి హాని కలిగితే దేశాధ్యక్షుడినైనా చంపించేందుకు వెనకడుగు వేయనని, ఈ మేరకు ఏర్పాట్లు చేసి పెట్టానని ఫిలిప్పీన్ ఉపాధ్యక్షురాలు సారా డ్యూటెర్టో పేర్కొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతుండగా.. ఓ కామెంటర్ ఆమెను జాగ్రత్త గా ఉండాలని హెచ్చరించాడు. ప్రత్యర్థి అక్కడే ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలంటూ పేర్కొన్నాడు.
దీనికి సారా స్పందిస్తూ ‘నేను కూడా ఓ వ్యక్తిని మాట్లాడి సిద్ధంగా ఉంచా. నన్ను చంపిన మరుక్షణమే బీబీఎం (ఫిలిప్పీన్ అధ్యక్షుడు మాక్రోస్), అతడి భార్య లీజా, దేశ స్పీకర్ మార్టిన్‌ను చంపాలని ఆదేశించా’ అని వ్యాఖ్యానించారు. తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉందో మాత్రం సారా వెల్లడించలేదు. కాగా అపాధ్యక్షురాలి బెదిరింపులతో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సెక్యూరిటీ కమాండ్ అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేసింది.