19-03-2025 12:00:00 AM
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్‌ఖాన్ నుంచి వస్తున్న తాజాచిత్రం ‘సికందర్’. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దీన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తుండగా, సాజిద్ నదియాడ్‌వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కథానాయికలు. సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ‘సికందర్ నాచే..’ అనే పాటను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. పాట బీట్ సంగీత ప్రియుల్లో జోష్ నింపుతోంది. ఈ గీతంలో సల్మాన్ కెమిస్ట్రీ పండింది. ముఖ్యంగా సల్మాన్ తన హుక్ స్టెప్‌తో ఆకట్టుకుంటున్నారు. ‘నేను నిన్నే రక్షిస్తాను.. నిన్నే ఆరాధిస్తాను.. నీ అందచందాలంటే పడి చస్తాను..
నువ్వు దూరమైతే భయపడతాను.. నీ హృదయంలోనే ఉంటాను.. నీ ప్రేమలో ప్రేమ పిచ్చివాడిగా ఉంటాను.. నా ప్రార్థనలు నీకోసం.. నీతోనే నా జీవితం.. నీ ప్రేమలో నేను మునిగిపోయాను.. ఇక నీతోనే నా ప్రతీ సంతోషం..’ అంటూ సాగుతోందీ పాట.
ఈ గీతాన్ని అమిత్ మిశ్రా, ఆకాశ, సిద్ధాంత్ మిశ్రా పాడారు. టర్కీయేకు చెందిన 500 మంది డ్యాన్సర్లు పాల్గొనడం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి డీవోపీ: తిర్రు; సంగీతం: ప్రీతమ్, సంతోష్ నారాయణన్.