calender_icon.png 19 April, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రతంత్రాలతో నేను ఆ పనిచేస్తా..

10-04-2025 12:00:00 AM

తమన్నా భాటియా తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టు ‘ఓదెల2’. ఈ నెల 17న విడుదల కానుందీ సినిమా. ఈ నేపథ్యంలో చిత్రబృందంతో కలిసి ఈ మూవీ ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నారామె. తమన్నా వ్యక్తిగత విషయానికొస్తే.. ఆమె కొన్నేళ్లుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరూ విడిపోయినట్టు కొన్నిరోజులుగా వార్తలొస్తున్నాయి.

పెళ్లి విష యంలో ఇద్దరి మధ్య అభిప్రా య భేదాలు తలెత్తాయని, అందుకే బ్రేకప్ చెప్పేసుకున్నారని ప్రచారం జరు గుతోంది. అయితే, బ్రేకప్ వార్తలపై ఈ జంట ఎక్క డా స్పందించలేదు. ఇదిలా ఉండగా, తాజాగా మంగళవారం ముంబయిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నటుడు విజయ్ వర్మ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఓ విలేకరి తమన్నాను ప్రశ్నించారు.

దీనిపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. తన మాటల్లో విజయ్ అనే పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్తగా బదులిచ్చారు తమన్నా. “తమన్నా జీ, ఆప్.. తంత్ మంత్ కీ విద్యా సే కిసీ కే ఊపర్ ‘విజయ్’ హాసిల్ కర్ నా చాహ్‌తీ హై?! (మంత్రాలు, తంత్రాలు ఉపయోగించి మీరు ఎవరి మీదనైనా విజయం సాధించాలనుకుంటున్నారా?!)” అని విలేకరి ప్రశ్నించగా, తమన్నా స్పందిస్తూ.. ‘మంత్రతంత్రాలతో అలాంటిది జరుగుతుందంటే నేను నమ్మను.

ఒకవేళ అదే నిజమైతే మీ (మీడియా)పై ప్రయోగిస్తా. అందరూ నా చేతుల్లో ఉం టారు. నేను చెప్పింది వింటారు.. నేను ఏం చెబితే అదే రాసుకుంటా రు’ అని సరదాగా జవాబిచ్చారు. విజయ్ పేరు ప్రస్తావించడానికి కూడా తమన్నా ఇష్టపడటం లేదని మాట్లాడుకుంటున్నారు.

తన గురించి ఇంకా చెప్తూ.. ‘ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఒక విషయాన్ని నేర్చుకున్నా. ఆనందం లేదా బాధ మన చేతుల్లోనే ఉండాలి. ప్రశ్న ఏదైనా లోతుగా ఆలోచిస్తే సమాధానం కూడా దొరుకుతుంది’ అన్నారు తమన్నా.