calender_icon.png 18 April, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తా

10-04-2025 06:12:48 PM

భక్తుల కొంగు బంగారం లక్ష్మీ నరసింహ స్వామి.. 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుకు షబ్బీర్ అలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో నూతన పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. వేసవికాలంలో భక్తులకు దాహార్తి తీర్చడానికి బోర్ మోటర్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా శనిగరం కమలాకర్ రెడ్డి, కమిటీ సభ్యులుగా బండారి యాదగిరి రెడ్డి, గట్టగోని రామ గౌడ్, కొత్త కాపు రాజారెడ్డి, పాత లక్ష్మీరాజ్యం, ఎర్రబోయిన దేవయ్య, కందాడి బాల్ రెడ్డి, కర్రోల్లశంకర్ గౌడ్, ఐలేని వెంకట రాజేశ్వర్ రావు, నల్ల అంజయ్య, చింత రాకేష్ కుమార్ చింతల నర్సింలు ప్రమాణ స్వీకారం చేశారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా మహిమలు గలదని అన్నారు. ఒక ముస్లిం ఆయన నాతో ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన స్వామి వారికి ఎంతో రుణపడి ఉన్నాను అన్నారు. ఈరోజు ఎండలు మండిపోతున్న సమయంలో భక్తులందరికీ వరుణుడు వర్షంతో స్వాగతం పలికారన్నారు. ఆలయానికి రోడ్డు, కరెంటు ఏర్పాటు చేసే భాగ్యం నాకు కల్పించారు స్వామివారు అని పేర్కొన్నారు. కమలాకర్ రెడ్డి చైర్మన్ గా గుడి అభివృద్ధి చాలా చేశారు. అందుకే ఆయనను తిరిగి చైర్మన్ గా నియమించడం జరిగింద అన్నారు. చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రతి ఆదివారం జనాలతో కిక్కిరిసిపోతుందన్నారు.  

కోరికలు కోరుకున్న వారికి కొంగు బంగారం అవుతుందఅన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు  గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నిమ్మమోహన్ రెడ్డి, కామారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, నౌసి నాయక్, అనంతరెడ్డి, రమేష్ గౌడ్, సుతారి రమేష్, నా రెడ్డి మోహన్ రెడ్డి, పండ్ల రాజు ఐరేని సందీప్, గుడుగుల శ్రీనివాస్, అంతంపల్లి సుధాకర్ రెడ్డి, చందు, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, పంపరి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.