28-08-2024 12:21:05 AM
మంత్రిపొన్నం హామీ
ముషీరాబాద్, ఆగస్టు 27: జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి మండలి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న తమ సొసైటీకి ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోతూ హౌ జింగ్ సొసైటీ(జీహెచ్‌జేహెచ్‌ఎస్) ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మం త్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ సొసైటీలో దాదాపు 1400 మంది జర్నలిస్టులున్నారని.. చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నారని అ న్నారు. గత ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇస్తామని ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.