calender_icon.png 26 December, 2024 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరోగానే చచ్చిపోతా

26-12-2024 01:50:00 AM

ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మిస్తున్నారు. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో హీరో ధర్మ మాట్లాడుతూ.. “డ్రింకర్ సాయి’ టీమ్ అంతా డబ్బు కోసం కాకుండా సినిమాను ఇష్టపడి వర్క్  చేశారు. నేను హీరో అవుదామనే ఇండస్రీకి వచ్చాను. హీరోగానే బతుకుతాను, హీరోగానే చచ్చిపోతా. హీరో అయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఇది నా డ్రీమ్‌” అన్నారు.‘ధర్మ నా కెరీర్‌లో చేసిన మొదటి చిత్రానికి హీరో.

అతనితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది’ అని హీరోయిన్ ఐశ్వర్యశర్మ తెలిపింది. డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో అంతా బతికేది చిన్న చిత్రాల వల్లే. అవి బాగుంటేనే అందరం బాగుంటాం. రివ్యూ రైటర్స్‌ను నేను బాగా గౌరవిస్తాను. మీకు మా ‘డ్రింకర్ సాయి’ సినిమా నచ్చకుంటే జీరో రేటింగ్ ఇవ్వండి. కాస్త మీ మనసును కదిలించినా 3 రేటింగ్ ఇవ్వండి” అని చెప్పారు.

ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ.. ‘సినిమా బాగా వచ్చింది. మ్యూజిక్, లిరిక్స్‌కు మంచి పేరొచ్చింది. ధర్మ, ఐశ్వర్య జోడి బాగుందంటూ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్, కొరియోగ్రాఫర్ మోయిన్, డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.