29-04-2025 06:53:12 PM
నూతన అధ్యక్షుడు కొండా నాగరాజు....
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కమిటీ ఎన్నికలు స్థానిక కమిటీ హాల్లో నిర్వహించారు. ఈ ఎన్నికలలో ప్రత్యర్థి మీద కొండా నాగరాజు అత్యధిక మెజార్టీతో అధ్యక్షుడుగా గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొండా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ... హౌసింగ్ బోర్డ్ కాలనీని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కాలనీకి పూర్వ వైభవం తీసుకొస్తానని, కాలనీలో అద్వాన్నంగా ఉన్న పలు సమస్యలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని, తన వంతు సహకారం అందిస్తానని తెలిపారన్నారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హల్ నిర్మాణం, పాత భవనాలకు రిపేర్లు, కలర్స్ వేసి మోడల్ కాలనీగా తయారు చేస్తానని తెలిపారు. తనను అధ్యక్షుడుగా ఎన్నుకున్న కాలనీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హౌజింగ్ బోర్డు కాలనీ ప్రధాన కార్యదర్శిగా గంగుల వినోద, కోశాధికారిగా బేతేల్లి రవి ఎన్నికయ్యారు.