calender_icon.png 31 October, 2024 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను ఆత్మహత్య చేసుకుంటా!

14-07-2024 06:20:17 AM

అడ్వకేట్‌కు లావణ్య సందేశం 

ఇంటికి చేరుకుని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు

రాజేంద్రనగర్, జూలై 13: రాజ్‌తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్య వ్యవహారం సినిమా ట్విస్టులను మించి సాగుతోంది. లావణ్యకు సంబంధించి మరో విషయం వెలుగు చూసింది. తాజాగా తాను ఆత్మహత్య చేసుకుంటానని తన అడ్వకేట్‌కు సందేశం పంపింది. తెలిసిన వివరాల ప్రకారం.. రాజ్‌తరుణ్‌పై పలు కేసులు నమోదు చేయించిన లావణ్య శుక్రవారం అర్ధరాత్రి ‘రాజ్‌తరుణ్ లేని లోకంలో నేను ఉండలేను.. నమ్మిన వారే నన్ను మోసం చేశారు.. రాజ్‌తరుణ్ చేతిలో నేను మోసపోయాను.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. రాజ్ తరుణ్‌తోపాటు అతడి తల్లిదండ్రులు, మాల్వీ మల్హోత్రా నా చావుకు కారణం’ అంటూ లావణ్య తన అడ్వకేట్‌కు సందేశ్ పంపించింది.  అప్రమత్తమైన అడ్వకేట్ వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లావణ్య ఇంటికి చేరుకుని, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

నా కుమార్తెపై నింద మోపొద్దు: లావణ్య తండ్రి

తన కుమార్తె లావణ్యపై అనవసరంగా నింద మోపొద్దని ఆమె తండ్రి మీడియా, సోషల్ మీడియాను అభ్యర్థించారు. ఒక ఆడపిల్ల తండ్రిగా తమను అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. రాజ్‌తరుణ్ అన్యా యం చేశారని ఆరోపించారు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని ప్రచారం చేయడం దారుణమన్నారు. అక్రమ సంబంధాలు అంటకట్టడం సరికాదన్నా రు. ఆమె సినిమా ప్రపంచంలోకి రావడం తప్పేమీ కాదన్నారు. రాజ్‌తరుణ్ ఎక్కడున్నా అతడిని తీసుకొచ్చి లావణ్య తో వివాహం చేస్తానన్నారు. మాల్వీ మల్హోత్రా 15 నెలల క్రితం రాజ్‌తరుణ్ జీవితంలోకి వచ్చిందని, ఆ తర్వాత తన కుమార్తె జీవితం దెబ్బతిన్నదని ఆరోపించారు.