calender_icon.png 29 March, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతతో ఉండే పాత్రలో కనిపిస్తా

21-03-2025 12:00:00 AM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్ కొంచెం క్రాక్’. వైష్ణవిచైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ విడుదలయ్యాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కిస్’ అనే ఓ రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ “ఈ సినిమాకు ‘జాక్ కొంచెం క్రాక్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం.. రైమింగ్‌తోపాటు హీరో క్యారక్టరైజేషన్.. సినిమా చూస్తే అది అర్థమవుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఓ లక్ష్యం ఉంటుంది. అయితే ఏ పని చేస్తున్నామనేదాంతోపాటు ఆ పనిని మనం ఎలా చేస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం.

ఓ పనిని ఇలానే ఎందుకు చేయాలి.. మరోలా నేను చేస్తానని కొందరు అంటుంటారు. అలాంటి వాడిని చూస్తే మనం క్రాక్ అంటుంటాం. అందుకనే ఈ టైటిల్ పెట్టాం. హీరో క్యారెక్టరైజేషన్ గురించి డైరెక్టర్ భాస్కర్ చెప్పగానే నచ్చి సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. నేను కూడా రైటర్‌ను కాబట్టి కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చాను.. దాన్ని భాస్కర్ ఆయన కథకు అనుగుణంగా డెవలప్ చేశారు. ప్రేక్షకులను నవ్విస్తూనే బాధ్యతతో ఉండే పాత్రలో కనిపిస్తా” అన్నారు. హీరోయిన్ వైష్ణవిచైతన్య మాట్లాడుతూ.. ‘సనారె యూత్‌కు కనెక్ట్ అయ్యేలా పాట రాశారు.

సురేశ్ ఇంత మంచిగా ట్యూన్ చేశారు. ఏప్రిల్ 10న మా జాక్ మూవీ థియేటర్లలోకి వస్తుంది. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా’ అన్నారు. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘సిద్ధు యువతలోనే కాదు.. అన్నీ వయసుల వారికీ స్టార్ బాయ్‌గా మారారు. జాక్ సినిమాను భాస్కర్ చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. గ్యారెంటీగా మంచి సినిమా అవుతుందని భావిస్తున్నా’ అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. ‘ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్ బాపినీడు, బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌తో ఈ సినిమాలో పనిచేసే అవకాశం నాకు కలిగిందుకు ఆనందంగా ఉంది’ అని తెలిపారు. పాటల రచయిత సనారె మాట్లాడుతూ ‘శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో పాట రాయటం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.