calender_icon.png 13 February, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలతో సమాధానం చెబుతా

13-02-2025 12:11:44 AM

దీపా ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా ‘తల’. అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్.

ఈ నెల 14న విడుదల కాబోతోన్న తల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈవెంట్‌లో రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. “తల కథ మా నాన్న నాకు రెండేళ్ల క్రితం చెప్పారు. ఆ కథ నుంచి మీ ముందు కొత్త యాక్టర్‌గా పరిచయం అవుతున్నాను.

ఈ మూవీకి మా నాన్న స్ట్రాంగ్ పిల్లర్‌గా ఉన్నారు. యాక్షన్ సీక్వెన్స్ లలో చాలా దెబ్బ లు తగిలాయి. 1౮ ఏళ్ల వయసు అబ్బాయి అమ్మ  సెంటిమెంట్‌తో ఏ లెవల్‌కు వెళతాడు అనేది మెయిన్ ప్లాట్‌” అన్నాడు. అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. “ ఇది నాకు ఛాలెంజింగ్ మూవీ. లైఫ్‌లో చాలా స్ట్రగుల్ చూశా. ఆ టైమ్‌లో నాకు ఏమైంది అని ప్రశ్నించిన అందరికీ ఈ మూవీ తో సమాధానం చెబుతాను” అని అన్నారు.