calender_icon.png 25 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్‌కు చెప్పేందుకు ఇబ్బందిపడ్డా..

22-01-2025 12:00:00 AM

శేఖర్ కమ్ముల కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బిచ్చగాడి పాత్ర గురించి హీరో ధనుష్‌కు చెప్పే విషయమై చాలా ఆలోచించారట. “కుబేర’ కథ సిద్ధమైంది. బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్‌కు ఎలా చెప్పాలా? అని ఎంతో ఆలోచించా.

ఒకింత ఇబ్బందికి గురయ్యాను. అసలు నేను ఆయనకు తెలుసో లేదో.. చెబితే ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న అనుమానం నన్ను వెంటాడింది. నేను ఫోన్ చేసినప్పుడు ఆయన స్పందన నన్ను ఆశ్చర్యపరిచింది. నేను తీసిన చిత్రాల్లో తన ఫేవరెట్ సినిమాలు, వాటిలోని సన్నివేశాల గురించి కూడా చెప్పారు. అలాంటి నటుడితో పని చేయడం సంతోషంగా అనిపించింది” అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.