వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మేకర్స్ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ వేడుకకు హీరో వరుణ్‌తేజ్ భార్య లావణ్య త్రిపాఠి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ.. “బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వచ్చిన వాసు అనే కుర్రాడు కథే ‘మట్కా’. ఒక మాస్ సినిమా చేద్దామని అనుకుంటున్నప్పుడు కరుణకుమార్ ‘మట్కా’ కథతో వచ్చారు. తను అద్భుతమైన మేకర్. ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం అనిపించింది. అన్నయ్య రామ్‌చరణ్, బాబాయ్, పెదనాన్న ఎప్పుడూ గుండెల్లో ఉంటారు.
టార్గెట్ రెండు సార్లు మిస్ అయింది. ఈసారి మాత్రం గట్టిగా కొడతా. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తిని కాదు. ఈసారి సినిమా చూసి నమ్మకంతో చెప్తున్నా” అన్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. ‘వైజాగ్‌లో ‘మట్కా’ ఒకప్పుడు జరిగిన కథ. వైజాగ్‌లో నైట్ క్లబ్బులు, క్యాబ్రీలు ఉండేవి.
అప్పటి మనుషులు చేసిన గొప్ప అచీవ్మెంట్లన్నీ చూపిం చాలనుకున్నా. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ” అని చెప్పారు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. “మట్కా’ తర్వాత వరుణ్‌తేజ్ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద మాస్ హీరో అవుతారు” అన్నారు. నిర్మాతలు విజయేందర్‌రెడ్డి, రజినీ, ఇతర చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది.