22-03-2025 12:00:00 AM
యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అక్కడి పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, దౌత్యవేత్తలు తాజాగా చిరంజీవిని సత్కరించిన విషయం తెలిసిందే. ఆయనకు ఈ కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన యూకేలోనే పర్యటిస్తున్నారు. తాజాగా అక్కడి అభిమానులతో సమావేశమై సరదాగా వారితో ముచ్చటించారు. అభిమానుల ఇళ్లకు వెళ్లి భోజనం చేయాలని ఉందంటూ మనసులో మాటను వెల్లడించారు. “మీరందరూ నా తమ్ముళ్లూ.. చెల్లెళ్లే. జీవితంలో ఏదో ఒక సినిమా చూసి లేదంటే ఏదో ఒక మాట విని మీరంతా స్పందించి నన్ను స్ఫూర్తిగా తీసుకున్న వారే. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నా.. నాకు ఇంతకు మించి ఏం కావాలి? ఇక్కడున్న వారందరి ఇళ్లకూ వెళ్లి వారితో కాసే పు సరదాగా గడిపి చెల్లెమ్మల వంటకాలను టేస్ట్ చేయాలని ఉంది.” అని చిరంజీవి తెలిపారు.
డబ్బు వసూళ్లపై సీరియస్..
ఈ క్రమంలోనే ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చిరంజీవి ట్విటర్ వేదికగా సీరియస్ అయ్యారు. ‘ప్రియమైన అభిమానులారా.. యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపించిన ఆసక్తి నా మనసుకు హత్తుకుంది. అయితే ఫ్యాన్ మీట్ పేరుతో కొం దరు డబ్బులు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇ లాంటి చర్యలను నేను సమర్థించను. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని ఉంటే వెంటనే రిటర్న్ చేయండి. ప్రేమాభిమానాలు చాలా విలు వైనవి. వాటిని కమర్షియల్ చేయకండి” అని చిరంజీవి అన్నారు.