calender_icon.png 26 April, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకులు నా పాత్రతో కనెక్ట్ కావాలనుకుంటా

24-04-2025 12:00:00 AM

సినిమాల ఎంపికలో సాయిపల్లవి రూటే సఫరేటు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీలో దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘రామాయణ’తో బిజీగా ఉంది. ఈ చిత్రంలో సాయిపల్లవి సీతగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడి పాత్రను పోషిస్తున్నారు. రెండు భాగాల్లో రూపొందుతున్న ఈ సినిమా తొలిభాగం 2026, మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. రామాయణ చిత్రం నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చింది. పాత్రల ఎంపికలో తాను వ్యవహరించే పద్ధతి గురించి చెప్తూ.. ‘ఏదైనా ఓ సినిమాను ఓకే చేసే ముందు కథలో ఎంతటి బలమైన భావోద్వేగాలు ఉన్నాయో తెలుసుకుంటా.

ఆ సినిమాలో నా పాత్రకు ఉండే ప్రాధాన్యం ఏ మేరకు ఉంటుంది? నా పాత్రతో ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారో విశ్లేషించుకుంటా. నిజాయితీతో కూడిన వాస్తవిక కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తా. అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులు నా పాత్రతో కనెక్ట్ కావాలని కోరుకుంటా. నా దృష్టిలో అదే అతిపెద్ద విజయం’ అని తెలిపింది.