calender_icon.png 27 January, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీవైపే తెరచాపను తిప్పేశా..

24-01-2025 12:00:00 AM

‘హైలెస్సో హైలెస్సా.. నీవైపే తెరచాపను తిప్పేశా.. హైలెస్సో హైలెస్సా.. నువ్వొస్తావని ముస్తాబై చూశా..’ అంటూ ప్రేయసీ ప్రియులు పాడుకుంటున్న ఈ గీతం శ్రోతల హృదిని తన వలలో బంధిస్తోంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంలోనిదీ పాట. ఈ పాటను మేకర్స్ థర్డ్ సింగిల్‌గా గురువారం రాత్రి విడుదల చేశారు. ఈ సాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ షిప్‌ని, ఎదురుచూపులను, కథా నాయికానాయకుల మధ్య ఉన్న అనురాగాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తోంది.

మోలోడీస్‌ని కంపోజ్ చేయడంలో తనదైన మార్కు చూపించే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఈ ‘హైలెస్సో’ పాటతో మరో లవ్ మెలోడీని అందించారు. శ్రేయ ఘోషల్, నకాశ్ అజీజ్ గాత్రం, శ్రీమణి అందించిన సాహిత్యం ఆకట్టుకుంటున్నాయి.

ఈ పాటలో సాయిపల్లవి, నాగచైతన్య కెమిస్ట్రీ అందంగా ఉంది. నాగచైతన్య రగ్గడ్ లుక్‌లో అదరగొట్టారు. సాయిపల్లవి క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో కట్టిపడేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.