calender_icon.png 19 January, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమ్మూరికి రావొద్దని చెప్పా..

07-12-2024 02:21:38 AM

  1. జనగామలో ఆయన ఓడిపోవడంతో ప్రొటోకాల్ సమస్య
  2. అభివృద్ధి పనులకే మా తొలి ప్రాధాన్యం
  3. దేవాదాయ మంత్రి కొండా సురేఖ

జనగామ, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ‘జనగామ జిల్లాలో అంతటా మా ఎమ్మెల్యేలు ఉన్నారు.. జనగామలో మాత్రం కొమ్మూరి ఓడిపోయి బీఆర్‌ఎస్ నుంచి పల్లా గెలిచారు.. దీంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినపుడు కొ మ్మూరి వస్తే ప్రొటోకాల్ సమస్య వస్తుం ది.. అందుకే అధికారిక కార్యక్రమాలకు రావొద్దని ఆయనకు నేను నచ్చజెప్పినా’ అని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం ఆమె జనగామలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యశ్వంతపూర్ పరిధిలో టీఎన్‌జీవోస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్డీవో కార్యాలయం లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

జనగామ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, ఎమ్మె ల్యే పల్లా ఏది కోరినా తప్పకుండా సహకరిస్తానని చెప్పారు. జనగామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న కొమ్మూరి సూచనలు తీసుకుంటున్నామని, కానీ ఆయనకు ప్రొటోకాల్ లేకపోవడంతో గొడవలు జరుగుతుండటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు రావద్దని నచ్చజెప్పినట్లు ప్రకటించారు.

జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుంద న్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ ర్‌రెడ్డి, మునిసిపల్ చైర్‌పర్సన్ పోకల జమున, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పలు వార్డుల కౌన్సిలర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

టీఎన్‌జీవోస్ సంఘం నిరాశ..

టీఎన్‌జీవోస్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం కొండా సురేఖ నేరుగా జనగామలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లారు. టీఎన్జీవోస్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం షెడ్యూల్ ప్రకారం మంత్రి పట్టణంలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడాల్సి ఉంది. ఇందుకోసం ఆ సంఘం నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.

సంఘం నేతలనందరిని సమీకరించి యశ్వంతపూర్‌లోని సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అయితే మంత్రి కొండా సురేఖ వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని జనగామకు వచ్చేసరికి ఆలస్యం అయింది. షెడ్యూల్ ప్రకారం భవన శంకుస్థాపన కార్యక్రమానికి మధ్యాహ్నం ఒంటిగంటకు రావాల్సి ఉండగా సాయంత్రం 4కు వచ్చారు.

దీంతో సమాయాభావ పరిస్థితుల వల్ల ఆమె బహిరంగ సభలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. దీంతో టీఎన్జీవోస్ నాయకులు, సభ్యులు నిరాశ చెందారు. సభకు మంత్రి సురేఖ వస్తుందనే ఆశతో ఎదురుచేసిన తమకు నిరాశే మిగిలిందని సంఘం నాయకులు అన్నారు. అయినా మంత్రి బిజీ షెడ్యూల్‌ను తాము అర్థం చేసుకుంటామన్నారు.