calender_icon.png 10 March, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక సంతానం వద్దని నేనే చెప్పా

09-03-2025 12:20:09 AM

ఇప్పుడు పరిస్థితులు మారాయి

పిల్లలను కనాలని మళ్లీ నేనే అంటున్నా

ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, మార్చి 8: గతంలో అధిక సంతానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, ఎక్కువ మంది పిల్లలను కానొద్దని తా నే చెప్పానని, మారిన పరిస్థితుల కారణంగా పిల్లలను కనాలని చెబుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం అతివలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సర్కార్ ప్ర స్తుతం పరభుత్వ ఉద్యోగులకు ఇద్దరి వరకు మాత్రమే ప్రసూతి సెలువులు ఇస్తుందని, ఇకపై దీన్ని ఎంతమంది పిల్లలకైనా వర్తించేలా చూస్తామన్నారు. వీటితో పాటు ఇతర ప్రయోజనాలను సైతం కల్పిస్తామన్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.