calender_icon.png 30 October, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు డబ్బింగ్ కష్టంగా భావించా..

10-08-2024 12:05:00 AM

హీరో రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజాచిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.  ఈ చిత్రం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విలేకరులతో శుక్రవారం ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... “-నేను మోడలింగ్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టినప్పుడే కెమెరా భయం పోయింది. -మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ ఛాన్స్ వచ్చింది. నేను ‘చందూ చాంపియన్’లో చిన్న క్యామియో తప్ప సినిమాలు చేయలేదు.

హరీశ్ శంకర్ చాలా పాషనేట్ డైరెక్టర్. రవితేజ ఛార్మింగ్ పర్సనాలిటీ. వాళ్లిద్దరి సపోర్ట్‌తో ఎక్కడా కష్టంగా ఫీల్ అవ్వలేదు. ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. ఈ చిత్రంలో నా పాత్ర పేరు జిక్కీ. తను తెలుగు మార్వాడీ గర్ల్. బచ్చన్ లైఫ్‌లో జిక్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. క్యాసెట్ రికార్డింగ్ షాప్ సీన్ చేసిన తర్వాత ‘ఐయాం ప్రౌడ్ ఆఫ్ యూ’ అంటూ డైరెక్టర్ అన్న మాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. -టాలీవుడ్‌లో ఇది నా మొదటి సినిమా అయినప్పటికీ నా సొంత వాయిస్ అయితే ప్రేక్షకులు మరింత రిలేట్ చేసుకుం టారని డైరెక్టర్‌ను కోరాను. తెలుగు డబ్బింగ్ చెప్పడం మొదట్లో కాస్త కష్టంగా అనిపించింది.. అసలు భాషను అర్థం చేసుకోవటానికే కష్టమైంది.

మూవీ టీమ్ చాలా సపోర్ట్ చేసింది. వారం రోజుల్లో డబ్బింగ్ ఫినిష్ చేశా. ప్రతి డైలాగ్ నా మాతృభాషకు ట్రాన్స్‌లేట్ చేసుకొని అర్థం చేసుకున్నా. అయితే కొద్దిరోజుల్లోనే భాషపై పట్టు సాధించా. తెలుగు చాలా బ్యూటీఫుల్ లాంగ్వేజ్. పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను ఇప్పటికే -కొన్ని ప్రాజెక్ట్స్‌కు సైన్ చేశా. వివరాలు మేకర్స్ వెల్లడిస్తారు.