calender_icon.png 6 October, 2024 | 12:02 PM

నేనిప్పుడు గాంధేయవాదిని ఆయుధాలను వదిలేశాను

06-10-2024 01:54:18 AM

కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్

శ్రీనగర్, అక్టోబర్ 5: దశాబ్దాలపాటు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించిన జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్  (జేకేఎల్‌ఎఫ్ వ్యవస్థాపకుడు యాసిన్ మాలిక్ తాను గాంధేయవా దిగా మారిపోయాయని ప్రకటించారు. హింసాత్మక మార్గాన్ని 1994లోనే వదిలేశానని చెప్పాడు.

జేకేఎల్‌ఎఫ్ ఉన్న నిషేధాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ట్రిబ్యునల్ ఇటీవల మరో ఐదేండ్లు పొడిగింది. ఈ అంశంలో ఆయన ట్రిబ్యునల్‌కు అఫిడవిట్ సమర్పించారు. ‘నేను ఆయుధాలను వదిలేశాను. నేనిప్పుడు గాంధేయవా దిని. గాంధేయమార్గంలోనే పోరాడుతున్నా ను. స్వతంత్ర, ఐక్య కశ్మీర్ కోసం గాంధేయమార్గంలో పోరాటం చేస్తాను’ అని  వెల్లడించారు.

ఉగ్రవాద మద్దతుదారు

జమ్ముకశ్మీర్‌లో 1990 దశకంలో ఉగ్రవా దం పేట్రేగటానికి యాసిన్ మాలిక్ కూడా ఒక కారకుడు. జేకేఎల్‌ఎఫ్ సంస్థను ప్రారంభించి కశ్మీర్ పండిట్లు, మైనారిటీలు, భద్రతా బలగాలపై తీవ్ర దాడులకు పాల్పడ్డారు. 2022లో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న కేసులో దోషిగా తేలటంతో ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. మాలిక్ ఇప్పటికీ ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాడని భద్రతాబలగాలు  కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నాయి