calender_icon.png 25 November, 2024 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా మాజీకి గిఫ్ట్‌ల కోసం.. అనవసరంగా ఎక్కువ వెచ్చించా!

25-11-2024 12:00:00 AM

చాలా కాలం తర్వత నటి సమంత మళ్లీ బిజీగా మారుతోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రెస్‌మీట్స్, ఇంటర్వ్యూతో నిత్యం వార్తల్లో నిలుస్తోందీ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘సిటాడెల్ : హనీబన్నీ’ వెబ్ సిరీస్ అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో సమంతకు జోడీగా వరుణ్ ధావన్ నటించారు. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్‌తో ఏర్పాటుచేసిన ఓ సరదా చిట్‌చాట్‌లో పాల్గొంది సామ్.

ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురుకాగా ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్పైసీ రాపిడ్ ఫైర్ అనే టాస్క్‌లో భాగంగా సమంతకు ధావన్ కొన్ని ప్రశ్నలు అడిగారు. టాస్క్‌లో భాగంగా ఇష్టమైతే సమాధానం చెప్పాలి, లేదంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సమంతకు.. ‘అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేని కోసం ఖర్చుపెట్టారు?’ అని వరుణ్ ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు సమంత బదులిస్తూ.. ‘నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకల కోసం ఖర్చు చేశా’ అని బదులిచ్చింది. అయితే ‘ఎంత ఖర్చు చేశారన్న’ ప్రశ్నకు మాత్రం.. ‘కాస్త ఎక్కువే..’ అంటూ ఇంకో ప్రశ్నకు వెళ్దామా.. అంటూ సమాధానాన్ని దాట వేసిందీ అక్కినేని ఇంటి మాజీ కోడలు. సామ్ ఈ మాటలు నాగచైతన్యను ఉద్దేశించే చేసిందా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇక మరో ప్రశ్నలో భాగంగా.. ‘ఈ షోకి వచ్చే ముందు ఎవరికి మెసేజ్ చేశారు? ఆ మెసేజ్‌ను చదివి వినిపించండి’ అంటూ వరుణ్ ప్రశ్నింగా.. సమాధానం చెప్పడానికి ఇష్టపడని సామ్ పచ్చిమిర్చి తినేసింది. సిటాడెల్ షూటింగ్ సమయంలో తన గురించి ఎవరితోనైనా గాసిప్స్ చెప్పావా అన్న వరుణ్ ప్రశ్నకు బదులిస్తూ.. ‘లేదు. ఏదైనా అంటే నీతో డైరెక్ట్‌గా చెప్పేదాన్ని’ అంటూ బదులిచ్చింది సామ్. ఈ కామెంట్స్ అన్నీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.