calender_icon.png 6 February, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను నేను అలా చూసుకున్నప్పుడు వణికిపోయా..

06-02-2025 12:18:43 AM

దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురిగా చిత్రసీమలో అడుగుపెట్టింది ఖుషీ కపూర్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘లవ్‌యాపా’. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఖుషీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, ఆసక్తిర విషయాలను తెలిపింది. ‘సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తేనే హిట్ అవుతుందనే ముఖ్యమైన విషయం అర్థమైంది.

“బిజినెస్ పరంగా చూసుకుంటే ‘లవ్‌యాపా’ యువతను బాగా ఆకట్టుకుంటుంది. ప్రతి సినిమా అందరికీ నచ్చేలా తీయలేం. నా తొలి సినిమా ‘ది అర్చీస్’ కంటే ఇప్పుడు చాలా నేర్చుకున్నాను. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఈ చిత్రంతో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ‘లవ్‌యాపా’ ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ అవుతోంది కాబట్టి కాస్త ఒత్తిడిగా ఉంది.

ట్రైలర్, సాంగ్స్ బిగ్‌స్క్రీన్‌పై చూసినప్పుడు వణుకు వచ్చింది. ఎందుకంటే మొదటిసారి నన్ను అలా చూసుకొని ఆనందించాను. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రావటానికి నావంతు కృషి చేస్తాను’ అని ఖుషీ చెప్పుకొచ్చింది.